శాలిబండ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో అగ్నిప్రమాదం

శాలిబండ బజాజ్ ఎలక్ట్రానిక్స్  షోరూమ్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది.బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ తగలబడింది.శాలిబండ ఏరియాలోని గోమతీ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న షోరూంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాణ సంచా వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు.