V6 News

హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం .. సోఫా తయారీ కేంద్రంలో ఎగసిపడిన మంటలు

హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం .. సోఫా తయారీ కేంద్రంలో ఎగసిపడిన మంటలు

హైదరాబాద్ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోఫా వర్క్‌షాప్‌లో  ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి.  వర్క్‌షాప్‌లో ఉన్న సోఫా సెట్లు, భారీ మొత్తంలో నిల్వ ఉంచిన ప్లైవుడ్ ,ఇతర ఫర్నిచర్ మెటీరియల్ నిమిషాల వ్యవధిలోనే అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు లక్షల రూపాయల విలువైన ఆస్తి బూడిదైనట్లు అంచనా వేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్  సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫైర్ ఇంజన్లు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో ఒక పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు,అగ్నిమాపక అధికారులు ఆరా తీస్తున్నారు.