కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన స్థానికులు

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని సంగీత్ నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే స్థానికులు మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

జగన్నాథ రథయాత్రలో భాగంగా ట్రాఫిక్ జామ్ లో ఫైర్ ఇంజిన్ చిక్కుకుపోవడంతో ఘటనాస్థలానికి వచ్చేందుకు ఆలస్యమైందని తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమీపంలోనే ఆసుపత్రి ఉంది. ఇవాళ (జూన్ 20న) సెలవు ఉండడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు స్థానికులు.