వరంగల్ జకోటియా కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ జకోటియా కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ పట్టణంలోని పోచమ్మ మైదాన్ లో జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకుంది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో పరుగులు పెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.