అమ్రాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు

అమ్రాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు

అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మొల్కమామిడి గ్రామానికి చెందిన కొండూరి వెంకటరమణ ఇంట్లో కరెంట్ షార్ట్​ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లో విలువైన వస్తువులు, సరుకులు, బట్టలతో పాటు రూ. 2 లక్షల నగదు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్  శ్రీకాంత్  ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. రూ. 3.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. బాధిత కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థికసాయం అందించారు. 

గద్వాల: కేటి దొడ్డి మండలం శివ రంగపురం గ్రామానికి చెందిన నర్సింలు, ఆనంద్, కిష్టప్ప తమ పొలం దగ్గర గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఆ గుడిసెలు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయాయి. మంటలను గుర్తించి బయటకు వచ్చిన తరువాత సిలిండర్ కు మంటలు వ్యాపించి పేలిపోవడంతో పక్కనే ఉన్న మరో గుడిసెకు నిప్పుంటుకుంది. రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించి బాధితులను పరామర్శించారు.