నాంపల్లి అగ్నిప్రమాదానికి ఇదే కారణం.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..

నాంపల్లి అగ్నిప్రమాదానికి ఇదే కారణం.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..

తీవ్ర కలకలం రేపిన నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. శనివారం ( జనవరి 24 ) మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద ప్రమాదమని.. మంటలు అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని అన్నారు విక్రమ్ సింగ్ మాన్. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ లో మొత్తం స్టాక్ స్టోర్ చేశారని.. . ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే కారణమని అన్నారు.

బేస్మెంట్ 1,2 పార్కింగ్ కోసం ఉపయోగించాలి..కానీ బిల్డింగ్ యాజమాన్యం నిబంధనలను పాటించలేదని అన్నారు. తమతో పాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా సహాయక చర్యలో పాల్గొంటుందని..మరో రెండు గంటలో రేస్క్యూ పూర్తి అయ్యే అవకాశం ఉందని అన్నారు. బస్మెంట్ లోనికి వెళ్ళడానికి మార్గం లేదని..  అదుకే ఆలస్యమైందని అన్నారు విక్రమ్ సింగ్ మాన్.

బేస్మెంట్ లోకి వెళ్లేందుకు మార్గం లేకపోయినా డ్రిల్ చేసుకుంటూ బ్రేక్ చేసి వెళ్తున్నామని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియజేస్తామని అన్నారు విక్రమ్ సింగ్ మాన్. ఇదిలా ఉండగా.. సెల్లార్ లో చిక్కుకున్నవారిని బయటికి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. సెల్లార్లో ఎంతమంది ఉన్నారన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.