ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..2 లక్షల నగదు బుగ్గిపాలు

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..2 లక్షల నగదు బుగ్గిపాలు
  • పెద్దపల్లి జిల్లాలో ఘటన

సుల్తానాబాద్: అగ్నిప్రమాదంలో దాదాపు రెండు లక్షల నగదు కాలిపోయింది.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణ రావు పల్లె గ్రామంలో ఇవాళ ప్రమాదవశాత్తు ఊర కొండయ్య  కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి సరుకుల కోసం కరీంనగర్ కు వెళ్లారు. ఇవాళ ప్రమాదవశాత్తు ఇల్లుకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, తులం బంగారం, ఐదు తులాల వెండి ఆభరణాలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .