హైదరాబాద్ మీర్ పేటలో అగ్ని ప్రమాదం..వెల్డింగ్ షాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ మీర్ పేటలో  అగ్ని ప్రమాదం..వెల్డింగ్ షాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది.  మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లేల గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెల్డింగ్ దుకాణంలో మంటలు చెలరేగాయి.  కార్ మెకానిక్ షాప్ , కార్ డెంటింగ్ షాప్‌తో సహా పక్కనే ఉన్న దుకాణాలకు  మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  

ఘటనా స్థలానికి చేరుకుని  ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

 హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి.  ఈ మధ్యనే పాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో 44 మంది చనిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి దర్యాప్తు చేస్తోంది.


 అది జరిగిన వెంటనే రెండు రోజుల క్రితమే అదే పారిశ్రామిక వాడలోని ఈ వేస్టెజ్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇవాళ మీర్ పేటలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇలా హైదరాబాద్ లో నిత్యం ఏక్కడో చోట చిన్న అగ్ని ప్రమాదం జరుగుతోంది.