రంగారెడ్డి జిల్లా మణికొండలోని జాలీ కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది, చిన్నారులంతా బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం గురించి తెల్వడంతో చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు. పిల్లలంతా సేఫ్ గా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారులను ఇంటికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణం విద్యుత్ షాట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిప్రమాదంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు క్షేమంగా బయటపడ్డారని..ఏదైనా ప్రమాదం జరిగి ఉండి ఉంటే ఏం చేసేవారని నిలదీశారు.
