గోవాలో తొలి ఒమిక్రాన్ కేసు.. 8 ఏళ్ల బాలుడికి పాజిటివ్

గోవాలో తొలి ఒమిక్రాన్ కేసు.. 8 ఏళ్ల బాలుడికి పాజిటివ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. భారత్ లో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. తాజాగా 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గోవాలో 8ఏళ్ల బాలుడికి ఓమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. డిసెంబర్ 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో అతడికి నెగటివ్ నిర్దారణ అయింది. దీంతో కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చాడు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలుడికి.. అతడి కుటుంబ సభ్యులకి పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీంతో బాలుడికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడి  శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షలో బాలుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోవాలో ఇదే మొదటి ఒమిక్రాన్‌ కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య సిబ్బందిని అలెర్ట్ చేసింది. మరోవైపుద దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 700కుపైగా ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.  సోమవారం ఒక్కరోజే 135 కొత్త కేసులు నమోదయ్యాయి.