ఎన్ ఎస్ జీ లో మెడికల్ స్టాఫ్ కు కరోనా

ఎన్ ఎస్ జీ లో మెడికల్ స్టాఫ్ కు కరోనా

న్యూఢిల్లీ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ ఎస్ జీ) లోని ఓ మెడికల్ స్టాఫ్ ఎంప్లాయ్ కి కరోనా సోకింది. దీంతో ఎన్ ఎస్ జీ విభాగంలో కలకలం మొదలైంది. ఇప్పటి వరకు కేంద్ర బలగాల్లో ఎన్ ఎస్ జీ లో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు. భద్రతా బలగాల్లో ఎవరికీ కరోనా సోకలేదని ప్రస్తుతం పాజిటివ్ గా తేలిన వ్యక్తి మెడికల్ స్టాఫ్ అని ఎన్ఎస్జీ తెలిపింది. అతన్ని వెంటనే క్వారంటైన్ కు తరలించినట్లు ప్రకటించింజి. ” ఇటీవల మానేసర్ హాస్పిటల్ లో చేరిన ఓ పేషెంట్ కు అటెండర్ గా వెళ్లిన మెడికల్ స్టాప్ కు కరోనా సోకింది. గురుగ్రామ్ లోని మానేసర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హాస్పిటల్ లో అతను విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించటంతో టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ” అని కఎన్ ఎస్ జీ ప్రకటన చేసింది. ఈ సంఘటన ఎన్ ఎస్ జీ బలగాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. కాగా పారామిలటరీ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఇండోటిబెటన్ విభాగాల్లోని 745 మందికి ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పారా మిలటరీ బలగాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.