వెంకన్న భక్తులు జర భద్రం.. తిరుపతిలో మొదటి కరోనా కేసు.. ఏపీలో 50కి చేరువలో కోవిడ్-19 బాధితులు

వెంకన్న భక్తులు జర భద్రం.. తిరుపతిలో మొదటి కరోనా కేసు.. ఏపీలో 50కి చేరువలో కోవిడ్-19 బాధితులు

తిరుపతి: ఏపీలో కరోనా కలకలం రేపింది. తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా కలకలం రేగింది. జులై 23న ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా 24న పాజిటివ్గా నిర్ధారణ అయింది. 

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించడంతో ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించ లేదని జిల్లా వైద్య శాఖ వెల్లడించింది.

శనివారం ఒక్కరోజే ఏపీలో 10 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో.. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏపీలో 49కి చేరింది. పలు హాస్పిటల్స్లో 24 మంది కరోనా పేషంట్స్ చికిత్స పొందుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరికి, గుంటూరు జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరి జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.