Mugguru Kothulu: టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న ‘ముగ్గురు కోతులు’.. నవ్వుల సందడి గ్యారంటీనా?

Mugguru Kothulu: టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న ‘ముగ్గురు కోతులు’.. నవ్వుల సందడి గ్యారంటీనా?

ముగ్గురు కోతులు సినిమాపై టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఇందులో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముగ్గురూ యువ హీరోలుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనున్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే విభిన్నమైన అర్ధాన్ని ఇస్తూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రానికి ఎస్. సుహాస్ తనదైన శైలిలో సంగీతం అందిస్తుండగా.. రాజ్ నోముల సినిమాటోగ్రాఫర్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ టీం ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.

ALSO READ : Film Industry Strike: థియేటర్స్ vs OTT..