దేశంలోనే ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ మన దగ్గరే

దేశంలోనే ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ మన దగ్గరే

హైదరాబాద్ : దేశంలోనే ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ లో రెండు కంటైనర్లలో డీఆర్డీఓ ఈ ల్యాబ్ ను సిద్ధం చేసింది. గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆన్ లైన్ ద్వాా రా  ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ నుంచి కేంద్రమంత్రులు సంతోష్ గంగ్వార్, కిషన్ రెడ్డి, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, డీఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పుణెలో వైరాలజీ ల్యాబ్ ఉండేది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సాధ్యమైనంత వేగంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. డెవలప్డ్ కంట్రీస్ లో మాత్రమే ఇలాంటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఉన్నాయి. అలాంటి దేశంలోనే ఫస్ట్ టైమ్ హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేయటం విశేషం. 15 రోజుల వ్యవధిలోనే రెండు కంటైనర్లలో డీఆర్డీఓ సైంటిస్టులు దీన్నిసిద్ధం చేశారు. కరోనా టెస్ట్ లతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీకి ఈ ల్యాబ్ ఉపయోగించనున్నారు. ల్యాబ్ తయారీకి డీఆర్డీఓ కు ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థలు సహకారం అందిచాయి.