
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ పేటీఎంలో వాటా సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ఈ మేరకు పేటీఎం మాతృ సంస్థ వన్ 95 కమ్యూనికేషన్స్ ఫౌండర్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ప్రముఖ యూపీఐ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, జియో ఫిన్ టెక్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే దిశగా అదానీ ఈ డీల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పేటీఎం ఆర్బీఐ పరిమితులు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో అదానీతో డీల్ ఆ కష్టాల నుండి బయట పడటానికి మార్గమని చెప్పచ్చు.
అదానీ, విజయ్ శేఖర్ మధ్య గత కొంత కాలంగా ఈ డీల్ పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ డీల్ వర్కౌట్ అయితే, వెస్ట్ ఏషియా సంస్థతో కూడా వన్ 97లో పెట్టుబడులు పెట్టించే ఆలోచనలో అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తన పెట్టుబడులను వివిధ రంగాల్లో విస్తరించుకుంటూ వెళ్తున్న అదానీ పేటీఎం డీల్ ఫిన్ టెక్ రంగంలో కీలక పరిణామంగా మారుతుందని చెప్పచ్చు. మరి, రీఛార్జ్ ప్లాట్ఫామ్ గా ప్రారంభమై యూపీఐ, బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన పేటీఎం సంస్థ ప్రస్తుతం ఆర్బీఐ పరిమితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న క్రమంలో అదానీ డీల్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.