టేక్మాల్ మండలంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

టేక్మాల్ మండలంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

టేక్మాల్, వెలుగు: టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయాల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్, నారాయణఖేడ్, పిట్లం, నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాల నుంచి వచ్చిన పహిల్వాన్లు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. కొబ్బరి కాయ కుస్తితో మొదలుకొని వెండి కడియం కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. చివరి కుస్తీలో మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉద్గిర్ కు చెందిన అభిజిత్ గెలుపొందగా, పది తులాల వెండి కడియాన్ని గ్రామానికి చెందిన కంకర సంగయ్య అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై మురళి బందోబస్త్ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.