హైమద్ బజార్‌‌లో నూతన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు

హైమద్ బజార్‌‌లో నూతన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు

నిజామాబాద్ సిటీ, వెలుగు:  నిజామాబాద్ నగరంలోని డీవన్ సెక్షన్ 58  డివిజన్ పరిధిలో దారుగల్లి, హైమద్ బజార్ హెడ్ పోస్టాఫీస్ ప్రాంతాల్లో మంగళవారం అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాట్లు చేశారు.  హెడ్ పోస్టాఫీస్ ప్రాంతంలో 315 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ బిగించారు.  మీసేవ దారు గల్లీ  ప్రాంతంలో మరొక 315  కేవీఏ ట్రాన్స్ ఫార్మర్,  హైమద్ బజార్ లైన్ గల్లీలో రెండు160  కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఏడీఈలు టౌన్ ఆర్. చంద్రశేఖర్,  తోట రాజశేఖర్,  నగేశ్ , సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.