- స్పాట్‌లోనే ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్’ విధానం అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ గొలుసు చోరీ కేసులో పోలీసులు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేశారు. కొండన్నగూడకు చెందిన వీరమ్మ అనే మహిళా రైతు గురువారం మధ్యాహ్నం తన పొలం దగ్గరకు వెళ్లారు. మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమెను వెంబడించాడు.
వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లో పరారయ్యాడు. బాధితురాలి నుంచి సమాచారం అందిన వెంటనే షాద్‌నగర్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ సీతారాం, ఎస్ఐ శివారెడ్డి స్పాట్‌కు చేరుకుని వీరమ్మ దగ్గర వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్ ఫైల్చేసి దర్యాప్తు ప్రారంభించారు.
