ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
  • సాయంత్రం 4 గంటలకు ఓట్లె లెక్కింపు ప్రారంభం.. పూర్తయ్యాక ఫలితాల ప్రకటన
  • విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు,  డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం

అమరావతి: పలుచోట్ల ఉద్రిక్తత సృష్టించిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ ముగింపు టైం ఈ మద్యాహ్నం 3:30 వరకూ పోలింగ్ కేంద్రంలో క్యూ లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.. మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత వచ్చే వారికి అవకాశం ఉండదు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో  సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా వార్డు మెంబర్ల అభ్యర్థుల ఓట్ల లెక్కింపు..ఆ తర్వాత సర్పంచు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు..చివరిగా ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సంపూర్ణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పగడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు,  డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం విధించారు. పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

కేసీఆర్ అండతోనే షర్మిల కొత్త పార్టీ

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం