
హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ రేసు పోటీల దగ్గర అభిమానులు ఆందోళన చేపట్టారు. వీఐపీ టికెట్లు తీసుకున్న లోపలికి అనుమతించటం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 6 వేల నుండి 12 వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న లోపలికి వెళ్లనీయటం లేదని ఆందోళన చేస్తున్నారు. వీఐపీ గ్యాలరీ మొత్తం వీఐపీలతో పాటు పోలీసుల కుటుంబ సభ్యులతో నిండిపోయింది. ఓవర్ లోడ్ అవుతుందనే పోలీసులు లోపలికి అనుమతించటం లేదని తెలుస్తోంది. అయితే టికెట్ కొన్న లోపలికి పంపించకపోవటంతో ఫ్యాన్స్ మండిపడున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రోజు పోటీలు డ్రైవర్ల ప్రాక్టీసుతోనే ముగిశాయి. రెండో రోజు ఉదయం మొదలు పెట్టిన ప్రాక్టిస్ మ్యాచ్ లు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లో మెయిన్ లీగ్ తో పాటు ఫార్ములా 4 రేస్ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. కాగా, ఇవాళ అసలైన పోటీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోటీలు మొదలయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోల్ పొజిషన్ రేసు ఉంటుంది. మధ్యాహ్నం 2గంటలకు 25నిమిషాల పాటు స్ప్రింట్ 2 రేసు ఉంటుంది. మధ్యాహ్నం మూడున్నరకు స్ప్రింట్ 3 రేస్ 45 నిమిషాల పాటు జరగనుంది. ఆదివారం కావటంతో రేసింగ్ చూసేందుకు సిటీ జనం ఆసక్తి చూపుతున్నారు.