SYG Glimps: భీకరమైన అసురుడి ఆగ‌మ‌నం.. నరాలు గగుర్పుడిచేలా ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్

SYG Glimps: భీకరమైన అసురుడి ఆగ‌మ‌నం.. నరాలు గగుర్పుడిచేలా ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’ (SYG). కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’ ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇవాళ బుధవారం (అక్టోబర్ 15న) సాయి దుర్గ‌తేజ్ బర్త్ డే స్పెషల్గా కీల‌క ఆప్టేట్ ఇచ్చారు మేకర్స్. ‘అసుర గ‌మ‌నం’ పేరుతో స‌ర్‌ఫ్రైజ్ గ్లింప్స్ రిలీజ్ చేసి సాయి దుర్గ తేజ్ ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ అందించారు. తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌‌‌‌‌‌‌‌ సరికొత్తగా ఉంది. ఇందులో ‘బలి’ అనే గంభీరమైన పాత్రలో సాయి నటిస్తున్నారు.

‘అసుర సంధ్య వేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అనే పవర్ ఫుల్ డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. సాయి దుర్గ తేజ్ లుక్స్, యాక్టింగ్, విజువల్స్, అజనీష్ BGM.. నరాలు గగుర్పుడిచేలా ఉన్నాయి. రోహిత్ కేపీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. విరూపాక్ష తర్వాత సాయి దుర్గ తేజ్.. మరో హిట్ కొట్టడం కన్ఫార్మ్ అనేలా గ్లింప్స్ అంచనాలు పెంచింది.

►ALSO READ | OTT Thriller: దృశ్యం డైరెక్టర్ నుంచి.. ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, కార్నేజ్ వీడియో.. ఇలా ప్రతిదీ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇపుడు ఈ లేటెస్ట్ గ్లింప్స్ మరిన్ని అంచనాలు పెంచుతూ ఫ్యాన్స్ని అలర్ట్ చేసింది. ఇక సాయి ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!!

ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. వెట్రివేల్ పళనిసామి DOP కాగా, నవీన్ విజయకృష్ణ ఎడిటర్. సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సిన ఈ మూవీ, వాయిదా పడింది. అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.