
ఓటీటీలోకి వచ్చే సినిమాలు, సిరీస్లు ఆడియన్స్కి సరికొత్త ఫీలింగ్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్, హారర్ థ్రిల్లర్ జోనర్స్లో వచ్చే సినిమాలు ఐతే.. వీపరీతంగా నచ్చేస్తున్నాయి. ఎందుకంటే.. ఇందులో వచ్చే ట్విస్టులు, అంతుచిక్కని టర్నింగ్ పాయింట్స్కి ఆడియన్స్ ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలోకి రానుంది. మరి ఆ మూవీ ఏంటీ? ఎలాంటి కథనంతో వస్తుంది? డైరెక్టర్ ఎవరు? అనే పూర్తి వివరాలు చూసేద్దాం.
డైరెక్టర్ జీతూ జోసెఫ్:
మలయాళ మూవీస్ ‘దృశ్యం’అండ్ ‘దృశ్యం2’ సినిమాల డైరెక్టర్ నుంచి మూవీ వస్తుంది. తన ఇంట్రెస్టింగ్ స్టోరీస్, స్క్రీన్ ప్లేతో నేషనల్ లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. అదే మిరాజ్. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు జోసెఫ్. ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 3తో బిజీగా ఉన్నారు.
మిరాజ్ ఓటీటీ:
ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి లీడ్ రోల్స్లో నటించిన మూవీ ‘మిరాజ్’. ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదలై, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. సోమవారం (అక్టోబర్ 20) నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ వంటి ఏడు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి IMDB నుంచి 7.1 రేటింగ్ సొంతం చేసుకుంది.
One story. Countless turns. No easy answers!
— Sony LIV (@SonyLIV) October 14, 2025
Jeethu Joesph's latest thriller #Mirage will be streaming from 20th Oct on Sony LIV#Mirage streaming from Oct 20th only on Sony LIV pic.twitter.com/d292k8ofIU
ఆసిఫ్ అలీ.. మలయాళ వర్సటైల్ యాక్టర్గా పేరుతెచ్చుకున్నారు ఆసిఫ్ అలీ. ఈ హీరో నటించిన మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఫాల్లోవింగ్ ఉంది. ఇటీవలే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన రేఖా చిత్రం, తలవన్, కిష్కింద కాండం వంటి మూవీస్తో ఆకట్టుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ తమర్ కె.వి. తెరకెక్కించిన సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సర్కీత్’తో పలకరించారు. ఈ మూవీ 2025 మే 8న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ఈ సినిమా ప్రస్తుతం మళయాళంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో కూడా చూసేయొచ్చు! త్వరలో తెలుగులో స్ట్రీమ్ అవ్వనున్నట్లు టాక్.
►ALSO READ | Bison Telugu Trailer: ఊర్లో కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు.. రా అండ్ రస్టిక్‌గా ‘బైసన్’ కాన్సెప్ట్
అపర్ణ బాలమురళి సినిమాలకు కూడా తెలుగులో మంచి ఫాల్లోవింగ్ ఉంది. ఆకాశమే నీ హద్దురా మూవీలో సూర్యకి జోడీగా నటించి మెప్పించింది. ఇటీవలే రాయన్లో సందీప్ కిషన్కి జోడిగా నటించి మరోసారి ఆకట్టుకుంది. సో, ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, డైరెక్టర్ జోసెఫ్ లపై నమ్మకం ఉంచి.. ‘మిరాజ్’ సినిమాను చూసేయొచ్చు.