Bison Telugu Trailer: ఊర్లో కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు.. రా అండ్ రస్టిక్‌గా ‘బైసన్’ కాన్సెప్ట్

Bison Telugu Trailer: ఊర్లో కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు.. రా అండ్ రస్టిక్‌గా ‘బైసన్’ కాన్సెప్ట్

కోలీవుడ్ స్టార్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైసన్’.  దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ ఈ సినిమాను రూపొందించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్‌‌ను రానా  దగ్గుబాటి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు.

1990  పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డీ ఆట కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్ రా అండ్ రస్టిక్‌గా ఇంటరెస్టింగ్‌గా సాగింది. ఫస్ట్ షాట్లో ఆంబోతు పుర్రెను చూపించడం, చివరిలో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం వంటి సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. తమ గ్రామంలో ముందు కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు.. అనే డైలాగ్తో సాగే సీన్ ఉత్కంఠ కలిగిస్తోంది.

ఓవరాల్గా ఓ వైపు ఆట కోసం తను కన్న కల, మరోవైపు తీరని పగతో పాటు తండ్రీ కొడుకుల రిలేషన్‌తో ట్రైలర్‌‌ ఆకట్టుకునేలా ఉంది. ఒకప్పుడు తన కొడుకు కలలకు వ్యతిరేకంగా కబడ్డీ ఆటకు దూరంగా ఉండాలన్న తండ్రి.. ఆ తర్వాత అతడిని విజయ శిఖరాలకు తీసుకెళ్లేలా ప్రోత్సహించే సీన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది.

మరో హీరోయిన్గా రజిషా విజయన్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది. పశుపతి, కలైయరసన్, హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.