ఈ ట్రాఫిక్ మార్షల్ స్పీడుకు సలాం కొట్టాల్సిందే.. హైదరాబాద్లో వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడాడో చూడండి

ఈ ట్రాఫిక్ మార్షల్ స్పీడుకు సలాం కొట్టాల్సిందే.. హైదరాబాద్లో వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడాడో చూడండి

హైదరాబాద్ లో ఒక ట్రాఫిక్ మార్షల్ సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఒక కుటుంబ భరోసాను నిలబెట్టింది. ఒక సెకనులో.. రెప్ప పాటు వేగంలో అతను స్పందించడంతో ఒక వ్యక్తి బతికాడు. కుత్భుల్లాపూర్ లో ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్ ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటున్నాడు. 

బుధవారం (అక్టోబర్ 15) కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడి ప్రాణాలు కాపాడాడు ట్రాఫిక్ మార్షల్ శివ కుమార్. సూరారం సిగ్నల్ వద్ద ట్రాఫిక్ కదులుతుండగా బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న బస్ కింద ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి పడిపోయాడు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్ కట్టేబోయిన శివకుమార్ వెంటనే స్పందించి సెకన్ సమయంలోనే ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు కాపాడాడు. ఈ విజువల్స్ చూసిన పలువురు వాహనదారులు ప్రాణాలు కాపాడిన శివకుమార్ ను అభినందించారు.