రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆరుట్ల మోడల్ స్కూల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆరుట్ల మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ సతీష్ కుమార్ ఆదివారం (మార్చి1)అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ చిలకానగర్ కు చెందిన సతీష్ కుమార్ గత కొంత కాలంగా ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ ఆదివారం ఉదయం అద్దె ఇంట్లోని బాత్ రూంలో ఒంటిపై బట్టలు లేని స్థితిలో శవమై కనిపించాడు.
గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు.
