
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి హన్సిక మోత్వానీ. ప్రస్తుతం ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితం సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార, 2022లో వ్యాపారవేత్త సోహైల్ కథురియాను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే, పెళ్లైన కొద్ది కాలంలోనే హన్సిక జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బలపడుతున్న విడాకుల రూమర్లు
అయితే గత కొంతకాలంగా హన్సిక తన భర్త సోహైల్‌కు దూరంగా తన తల్లితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. ఇది వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ రూమర్లు ఒకవైపు ఉండగానే, హన్సికపై ఆమె సోదరుడి భార్య తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. హన్సిక, ఆమె తల్లి తమను గృహహింసకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హన్సిక ఒకవైపు వైవాహిక జీవితంలో సమస్యలు, మరోవైపు కుటుంబ వివాదాలతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫుల్ ఫోకస్ ఆన్ కెరీర్
ఈ సమస్యలు, నిరాశ నుంచి బయటపడటానికి హన్సిక ఇటీవల కొన్ని విహారయాత్రలు చేసి తిరిగి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇకపై తన దృష్టిని పూర్తిగా మళ్లీ సినిమాలపైనే కేంద్రీకరించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.. తనపై వస్తున్న విమర్శలు, వార్తల పట్ల ప్రత్యేక దృష్టి సారించి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో హన్సిక ఉన్నట్లు టాక్. తనకు అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికల్లా తన జీవితంలోని ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి హన్సిక సినీ కెరీర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.