అక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం సందర్శన.. మోదీ ధ్యానం చేసే స్థలంలో కోడె నాగు హల్ చల్..

అక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం సందర్శన.. మోదీ ధ్యానం చేసే స్థలంలో కోడె నాగు హల్ చల్..

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (అక్టోబర్ 16) శ్రీశైలం రానున్నారు. ఈ క్రమంలో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ సందర్భంగా బుధవారం (అక్టోబర్ 15) ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, రూట్ మ్యాప్ , రాగమయూరి బహిరంగ సభ, గూగుల్ జియో మ్యాప్ మొదలైన అంశాలను పోలీసు యంత్రాంగంతో చర్చించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన  భద్రతా చర్యల ఏర్పాట్ల పై పలు సూచనలు చేశారు. 

ప్రధాని పర్యటనలో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీజీపీ సూచించారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా గట్టి చర్యలు చేపట్టాలని.. అదే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 

బహిరంగ సభకు  ఎక్కడి నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయనే  ప్రతి విషయం పై అవగాహన ఉండాలన్నారు. గ్యాలరీలలో ఉండే  క్రౌడ్ పట్ల సెక్టార్ ఇంఛార్జ్ ఐపియస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  రోడ్ షో  ఉన్నచోట బారికేడ్స్ , రోప్ పార్టీలు  సిధ్దంగా ఉండాలని సూచించారు. అవసరం అయితే వాలంటీర్ల సహాకారం తీసుకోవాలన్నారు. 

మ్యాన్ ప్యాక్ లలో  ఉన్న ఛానెల్ ని ఇయర్ ఫోన్స్ కు కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు  కంట్రోల్ రూమ్ కి, పై అధికారులకు  సమాచారం అందించాలన్నారు డీజీపీ. రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ మళ్ళింపు,  కాన్వాయ్ లు, ఎయిర్ పోర్టు, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలు, బహిరంగ సభకు ఇరువైపుల  అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సులు, ఆటోలు రోడ్డు పై ఆపకుండా ప్రక్కకు ఆపే విధంగా చూసుకోవాలన్నారు. 

అడిషనల్ డీజీ ఎన్. మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ..  అవసరమైన చోట్ల, నన్నూరు టోల్ గేట్ దగ్గర అత్యవసరం అయితే పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్ షో ఉన్న చోట పబ్లిక్ గ్యాలరీలలో  ముందు ఉన్న ప్రజలు లేచి నిలబడి గుమిగూడకుండా,  వెనుక ఉన్న ఇతర ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా చూసుకోవాలన్నారు.  బహిరంగ సభ వద్ద మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మోదీ ధ్యానం చేసే ప్రాగంణంలో పాము..

ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా.. అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు అధికారులు. గురువారం ప్రధాని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. అయితే అదే ప్రాంగణంలో కోడెనాగు హల్ చేయడం కలకలం రేపింది. ప్రధాన గేటు దగ్గర సెట్రిక్ పాము ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమై.. పామును పట్టుకున్నారు.