Infosys ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తనే.. ఎదురుచూసిన రోజు వచ్చినట్టేనా..?

Infosys ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తనే.. ఎదురుచూసిన రోజు వచ్చినట్టేనా..?

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 17 లోపు వ్యక్తిగత పనితీరుకు సంబంధించిన సెల్ఫ్​అసెస్మెంట్స్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని ఉద్యోగులకు ఇన్ఫోసిస్ HR టీం నుంచి మెయిల్ వచ్చింది. దీంతో.. వేతనాల పెంపుపై ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగుల వార్షిక పనితీరుకు సంబంధించి సమీక్షించే ప్రక్రియకు Infosys పూనుకోవడంతో 2026లో శాలరీలు తప్పక పెరుగుతాయని ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆశిస్తున్నారు.

ఇన్ఫోసిస్లో జనవరిలో కొందరు ఉద్యోగులకు, ఏప్రిల్ 2025లో మరికొందరు ఉద్యోగులకు శాలరీలు పెరిగాయి. అయితే ఈ శాలరీ హైక్ అందరికీ ఇవ్వకపోవడంతో కొందరు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. JL5 స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు, టీమ్ లీడ్‌లు మాత్రమే జనవరిలో శాలరీ హైక్ పొందారు. JL6, అంతకంటే ఎక్కువ ఉన్న వారు ఏప్రిల్ వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 

శాలరీ హైక్ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వేతనాల పెంపు లేదని హైక్ అందుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు కూడా కొంత నిరాశకు లోనయ్యారు. ఇన్ఫోసిస్ 2022 ఆర్థిక సంవత్సరంలో జీతాలను పెంచలేదు. 2023లో మళ్లీ శాలరీలను పెంచింది. ఇప్పుడు దాదాపు 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగుల జీతాలను పెంచాల్సిన పరిస్థితి ఉండటంతో ఇన్ఫోసిస్ అప్రైజల్ పాలసీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి భారత ఐటీ రంగం అంతటా ఉంది. 

అక్టోబర్ 16న ఇన్ఫోసిస్ కంపెనీ సెకండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ను వెల్లడించనుంది. ఈ లాభాలు ఏ స్థాయిలో ఉందనే విషయం తెలిస్తే ఉద్యోగుల జీతాల పెంపు ఎలా ఉండనుందనే అంశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2026లో అయినా తాము ఆశించిన స్థాయిలో జీతాలు పెరిగితే బాగుండని ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.