తెలంగాణ లో తొలి అడుగు పడింది : పవన్ కల్యాణ్

తెలంగాణ లో తొలి అడుగు పడింది : పవన్ కల్యాణ్
  • మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల గెలుపుపై పవన్ కల్యాణ్ హర్షం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన గెలుపుపై ఆ పార్టీ ప్రెసిడెంట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 2,998 మున్సిపల్ వార్డులు, డివిజన్లలో జనసేన 332 చోట్ల పోటీ చేసిందని.. ఇందులో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్ లో సాగర్ గెలుపొందారని ఆయన తెలిపారు. 

ఈ  సందర్భంగా వారిద్దరికీ పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఏర్పాటైన పార్టీకి ఈ ఇద్దరి రూపంలో తొలి అడుగు పడిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఏర్పాటు చేసిన టైమ్ లో భవిష్యత్ ఏంటనే ఆందోళన, గందరగోళం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కాగా, మున్సిపల్​ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచారం చేసి, గెలుపులో పాత్ర వహించిన ఓటర్లకు, ప్రజలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.