BAN vs AFG: 7376024592.. ఫోన్ నెంబర్ కాదు బంగ్లా బ్యాటింగ్ లైనప్: 10 మంది సింగిల్ డిజిట్.. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ విజయం

BAN vs AFG:  7376024592.. ఫోన్ నెంబర్ కాదు బంగ్లా బ్యాటింగ్ లైనప్: 10 మంది సింగిల్ డిజిట్.. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ విజయం

రివెంజ్ అంటే ఎలా ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కు అర్ధమయ్యేలా చెప్పింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. వన్డేల్లో మాత్రం అదరగొట్టింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను  3-0 తేడాతో గెలుచుకొని ప్రతీకారం తీర్చుకుంది. తొలి రెండు వన్డేలు గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. మంగళవారం (అక్టోబర్ 15) బంగ్లాదేశ్ పై జరిగిన మూడో వన్డేలో భారీ విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విజయం సాధించి అబుదాబి గ్రౌండ్ లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. 

ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 95 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లోయర్ ఆర్డర్ లో మహమ్మద్ నబీ 37 బంతుల్లోనే 62 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గుర్బాజ్42 పరుగులు చేసి రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహ్మద్, తన్వీర్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

►ALSO READ | Ranji Trophy 2025-26: ఫుట్ బాల్ కాదు ఇది క్రికెటే: మహారాష్ట్రకు ఘోరమైన ఆరంభం.. నలుగురు డకౌట్

294 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సైఫ్ హసన్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో పేసర్ బిలాల్ సమీ 5 వికెట్లతో చెలరేగాడు. రషీద్ ఖాన్ మూడు వికెట్లతో రాణించాడు. బిలాల్ సమీఆఫ్ ది మ్యాచ్.. ఇబ్రహీం జద్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఈ టూర్ లో భాగంగా మొదట బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ ను ఆఫ్ఘనిస్తాన్ 3-0 తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.