బెల్లంకొండ మాస్ బీట్ ..సెకన్లలోనే రికార్డ్ వ్యూస్

బెల్లంకొండ మాస్ బీట్ ..సెకన్లలోనే  రికార్డ్ వ్యూస్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda srinivas) బాలీవుడ్ లో ఎంట్రీ  ఇస్తున్న చిత్రం ఛత్రపతి. తెలుగులో ప్రభాస్-రాజమౌళి(Prabhas) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతికి(Chatrapathi) ఇది రీమేక్. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్(VV Vinayak) తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో.. నుష్రత్ భరుచ్చా(Nushrath bharuchha) కథానాయికగా నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో రానున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. మే 12న విడుదలనుంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి మొదటి సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. సాంగ్ టీజర్ లో బెల్లంకొండ స్టైలిష్ లుక్స్, నుష్రత్ అదిరిపోయే అందాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక విడుదలైన కొన్ని సెకన్లలోనే ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

 ఇప్పటికే విడుదల చేసిన ఛత్రపతి మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్  వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ మూవీలో బాలీవుడ్ టాప్ యాక్టర్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తన తొలి బాలీవుడ్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఆడియెన్స్ ను మెప్పిస్తాడా.? లేదా. ? అన్నది తెలియాలంటే మే 12 వరకు వేచి చూడాల్సిందే.