మొదట 19 లక్షల కరెంట్ బిల్లు.. లొల్లి చేస్తే రూ.1,000కి తగ్గింది

మొదట 19 లక్షల కరెంట్ బిల్లు.. లొల్లి చేస్తే రూ.1,000కి తగ్గింది

అది రెండు రూములు ఉండే రేకుల ఇల్లు. అందులో రెండు ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఇంటికి ఏకంగా రూ. 19,19,268 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. మార్చి 4 నుంచి జూన్ 3 వరకు 9,04,259 యూనిట్ల కరెంట్ కాలిందని బిల్లులో ఉంది. నల్గొండ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై ఆ ఇంట్లో అద్దెకుండే మాధవి అనే మహిళ కరెంట్ అధికారులను నిలదీయగా, బిల్లును మళ్లీ సరిచేశారు. 321 యూనిట్లు కాలిందని.. రూ.1,002 బిల్లు ఇచ్చారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లనే ఇట్ల జరిగిందని ఏఈ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ నెల రాష్ట్రమంతా కూడా కరెంట్ బిల్లులు ఎక్కువగానే వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే అన్ని బిల్లులు కరెక్టో కాదో అనే అనుమానం రాక మానదు.

For More News..

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. రిటర్న్ కు మినహాయింపు ఇచ్చే అవకాశం!

కరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు

కేటీఆర్ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి