పిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే

పిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే

పిడుగుపాటుకు ఒకే ఇంట్లోని ఐదుగురు చనిపోయిన ఘటన అస్సాంలో జరిగింది. కరీమ్‌గంజ్ జిల్లాలోని ఇషాఖౌరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగులు కూడా పడ్డాయి. గ్రామానికి చెందిన ఇస్లాముద్దీన్ తన పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇంటిపై పిడుగు పడటంతో ఇంట్లోని నలుగురు పిల్లలతో సహా ఆయన కూడా మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని 50 ఏళ్ల ఇస్లాం ఉద్దీన్, 12 ఏళ్ల అన్వర్ హుస్సేన్, 12 ఏళ్ల షరీఫుద్దీన్, 10 ఏళ్ల దిల్వర్ హుస్సేన్, 9 ఏళ్ల అబిదా బేగంగా గుర్తించారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం కరీంగంజ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఇషాఖౌరి గ్రామం రతబరి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో.. ఆ ప్రాంత ఎమ్మెల్యే బిజోయ్ మల్కర్ ఘటనా స్ఠలాన్ని పరిశీలించారు. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇషాఖౌరి గ్రామంలోని ఒక కుటుంబం ఇంట్లో ఉండగా.. వారి ఇంటి మీద పిడుగు పడిందని.. ఆ ఘటనలో అయిదుగురు చనిపోయారని కరీమ్‌గంజ్ సూపరింటెండెంట్ పోలీస్ సంజిత్ కృష్ణ తెలిపారు.