రామగుండం ఎన్టీపీసీలో మళ్ళీ ఐదు యూనిట్ల షట్ డౌన్

రామగుండం ఎన్టీపీసీలో మళ్ళీ ఐదు యూనిట్ల షట్ డౌన్

గోదావరిఖని/జ్యోతినగర్​, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో శనివారం మళ్ళీ ఐదు యూనిట్లను షట్​ డౌన్​ చేశారు. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో థర్మల్​ విద్యుత్​కు డిమాండ్​ లేనందున ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్​ పరిధిలోని 200 మెగావాట్ల 2వ యూనిట్​, 500 మెగావాట్ల 4, 5, 7వ యూనిట్లు, ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్​ లోని స్టేజ్​ 1లో గల 800 మెగావాట్ల 2వ యూనిట్​లో విద్యుత్​ ఉత్పత్తిని నిలిపివేశారు. 

గత శనివారం కూడా ఇదే తరహాలో నేషనల్​ గ్రిడ్​ నుంచి థర్మల్​ విద్యుత్​కు డిమాండ్​ లేని కారణంగా రామగుండం ఎన్టీపీసీలోని నాలుగు యూనిట్లను షట్​ డౌన్​ చేశారు. శనివారం, ఆదివారం, సోమవారం ఇదే పరిస్థితి ఉంటుందని, మంగళవారం తిరిగి యూనిట్లలో విద్యుత్​ ఉత్పత్తి చేయనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.