మనం తింటే.. వాళ్లు డబ్బులిస్తరు.. కానీ చిన్న పనిచేసిపెట్టాలి

మనం తింటే.. వాళ్లు డబ్బులిస్తరు.. కానీ చిన్న పనిచేసిపెట్టాలి

జీవితంలోని ప్రతి అవసరం డబ్బుతో మాత్రమే నెరవేరుతుంది. అందుకే ఈ కాలంలో.. మనిషి డబ్బు సంపాదించడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. అలాంటివాళ్లకు ఈ రెస్టారెంట్ ఓ సువర్ణావకాశం. ఎందుకంటే.. ఏ రెస్టారెంట్ లో అయినా తినాలంటే డబ్బు కట్టాలి. కానీ, ఈ రెస్టారెంట్ లో మనం తిన్న వాటికి డబ్బులిస్తారు. అదికూడా వందలు, వేలల్లో కాదు.. లక్షలు కోట్లల్లో. కానీ, వాళ్లకు ఓ చిన్న పనిచేసి పెట్టాలి.

రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టిన బర్గర్ కు విచిత్రంగా ఓ పేరు పెట్టాలి. ఆ పేరు ఓనర్స్ కు నచ్చితే లక్షల్లో డబ్బులిస్తారు. దానికోసం ఈ రెస్టారెంట్ వాళ్లు ఒక పోటీ కూడా నిర్వహిస్తారు. అయితే, ఈ పోటీలో పాల్గొనాలంటే యూకే వెళ్లాల్సిందే. యూకేలోని ఫ్లేమింగ్ గ్రిల్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ పోటీ నిర్వహిస్తారు.

వాళ్ల రెస్టారెంట్ స్పెషల్ బర్గర్ కు మంచి పేరు కోసం వెతుకుతున్న ఓనర్లు ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత వాళ్ల ఇన్ స్టాగ్రామ్ పేజ్ ను ఫాలో కావాలి. పోటీల్లో వచ్చిన ప్రత్యేకమైన పేరును బర్గర్ కు పెడతారు.