అవిసెలో ఒమెగా-3, ఫైబర్, ప్రొటీన్ పోషకాలు పుష్కలం. ఇవి కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో పనిచేస్తాయి. క్రమం తప్పకుండా తింటే ఎలాంటి రోగాలను రాకుండా దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.
- అవిసెల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇవి జీర్ణశక్తి కి మంచిది. ఈ గింజల్ని మొత్తగా పొడి చేసి చపాతి, దోసె, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడుకోవచ్చు. అవిసె విత్తనాల్లో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఈ గింజలను ప్రతిరోజు ఉదయం తీసుకుంటే అలసటను దూరం చేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
- క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. అవిసెలు ముందుంటాయి. ముఖ్యంగా రొమ్ముకేన్సర్ రిస్క్ ను తగ్గించడంలో అవిసెలు బాగా ఉప యోగపడతాయి.
- అవిసెల్లో ఏఎల్ఏ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జట్టుకు, చర్మానికి మేలు చేస్తాయి. చుండ్రు, మొటిమలు, ఎగ్జిమా, రొసేషియా వంటి చర్మ సమస్యలు దరిచేరవు. కళ్లు పొడిబారే సమస్య కూడా దూరమవుతుంది.
- వీటిలో 'లిగ్నన్' అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలు దరిచేరకుండా చూస్తాయి. కణజాల ఆరోగ్యానికి, హార్మోన్ల బ్యాలెన్స్ కు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది.
- అవిసెల్లో ఉన్న యాంటీ వైరల్, యాంటీ బ్యా క్టీరియల్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను మరింత పరిపుష్టం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు అవిసెలు తోడ్పతాయి.
- గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చూస్తాయి.
- అవిసె నూనెతో మణికట్టు దగ్గర మర్దన చేస్తే కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య పెరగకుండా ఉంటుంది. సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి..
