
ఎల్బీనగర్,వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు గొడవకు దారితీసింది. టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిల్స్‌తో యువకుడిపై దాడి చేసిన ఘటన బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధి గాంధీనగర్‌లో జరిగింది. ఆదివారం బోనాల పండగ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫొటోతో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీని బీజేపీ జెండా దిమ్మెకు కట్టారు. బీజేపీ కార్యకర్త సుధీర్ ఆ ఫ్లెక్సీని తొలగించాడు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సుధీర్‌ను మల్లేష్ అనే వ్యక్తి ఇంటికి పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా బీరు సీసాలతో కొట్టడడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు మీర్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. బీజేపీ కార్యకర్తపై దాడి సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది.