హైదరాబాద్, వెలుగు: కార్డు చెల్లింపుల కోసం ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్, పేయూ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ప్రారంభించాయి. వినియోగదారులు ఓటీపీ అవసరం లేకుండానే ముఖ గుర్తింపు లేదా వేలిముద్రతో లావాదేవీలు చేయవచ్చు.
ఈ సదుపాయం మొదటగా యాక్సిస్ బ్యాంక్ కార్డు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సిమ్ మార్పిడి, ఓటీపీ మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పేయూ సంస్థ దీనికి అవసరమైన టెక్నాలజీని అందిస్తోంది.
