డీపీఐఐటీతో ఫ్లిప్‌‌‌‌కార్ట్ జోడీ

డీపీఐఐటీతో ఫ్లిప్‌‌‌‌కార్ట్ జోడీ

 న్యూఢిల్లీ: మనదేశాన్ని "బొమ్మల ఎగుమతి కేంద్రం"గా మార్చేందుకు  ఫ్లిప్‌‌‌‌కార్ట్, డిపార్ట్‌‌‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)  చేతులు కలిపాయి.  బొమ్మల సప్లై చైన్ లో భారతదేశ సామర్థ్యాలు పెంపొందించటానికి డీపీఐఐటీ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ను నిర్వహించింది.  అధిక-నాణ్యత గల బొమ్మలను ఉత్పత్తి చేయడంపై ఇది దృష్టి సారించింది.   వందలాది బొమ్మల తయారీదారులు ఈ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో పాల్గొన్నారు.  ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ నిపుణులతో వీళ్లు నాణ్యత మెరుగుదల, ఆవిష్కరణలు,  పరిశ్రమ ప్రమాణాల గురించి చర్చించారు.