2024లోనూ అదే దరిద్రమా : ఫ్లిప్‌‍కార్ట్ ‍‍లో 1,500 మంది ఉద్యోగులు తీసివేత

2024లోనూ అదే దరిద్రమా : ఫ్లిప్‌‍కార్ట్ ‍‍లో 1,500 మంది ఉద్యోగులు తీసివేత

2024లోనూ ఫ్లిప్ కార్ట్ ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తోంది.. గతేడాది భారీ ఎత్తున ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగి స్తోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు 15 వందల మంది ఉద్యోగులు ఇంటి బాట పట్ట నున్నారు.  పనితీరు సమీక్షలతో ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. నివేదిక ప్రకారం.. మార్చి- ఏప్రిల్ 2024 నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తుందట. 

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 22 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే లేఆఫ్స్ లో  దాని ఫ్యాషన్ పోర్టల్ మింత్రా(Myntra)  ఉద్యోగులను చేర్చడం లేదు. దీంతో పాటు కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం చేపట్టడం లేదు. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు 2024 ఎలాంటి రిక్రూట్ మెంట్లు చేయడంలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో ఫ్లిప్ కార్ట్ సహా ఈ కామర్స్ పరిశ్రమ వ్యాపారంలో హెచ్చు తగ్గులు చూసింది. దీంతో ఆయా కంపెనీలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయని తెలు స్తోంది.