తాలిపేరుకు పెరుగుతున్న వరద

తాలిపేరుకు పెరుగుతున్న వరద
  •     22 గేట్లను రెండు అడుగుల  మేర ఎత్తిన అధికారులు 
  •     గోదావరిలోకి 5,958 క్యూసెక్కులు 

భద్రాచలం, వెలుగు: భద్రాచలం డివిజన్​లోని చర్ల మండలం తాలిపేరు ఉపనదికి ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా తాలిపేరు పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల నుంచి వచ్చి చేరుతున్న నీటితో ప్రాజెక్టులోకి వరద వస్తోంది. దీంతో సోమవారం ఇంజినీర్లు 22 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,958 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

 ఈ కారణంగా తేగడ గ్రామం వద్ద ఉన్న తాలిపేరు లో లెవల్​చప్టా మునిగింది. వరద పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బందిని అలర్ట్ చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్ ​కారణంగా, స్వల్పంగా గోదావరి కూడా పెరుగుతుండటంతో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు.