నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్

 నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్

హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ప్రాంగణానికి గద్దర్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గద్దర్ పెరేడ్ గ్రౌండ్ కు రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరుచగా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల సభకు హాజరైన గద్దర్ ఇవాళ మోడీ సభకు హాజరుకావడం గమనార్హం. 

మోడీ ప్రసంగం వినేందుకే వచ్చా

బీజేపీ సభకు గద్దర్ హాజరుకావడంపై పలువురు ప్రశ్నించగా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినడానికే తాను సభకు వచ్చానని అన్నారు. ఆయన ఏం సందేశం ఇస్తారు అనేది వేచి చూసి.. ప్రసంగం తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానని అక్కడున్న మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.