ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్కార్ట్.. 30 రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్కార్ట్.. 30 రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

న్యూఢిల్లీ: వాల్‌‌మార్ట్ యాజమాన్యంలోని ఈ–కామర్స్​ సంస్థ ఫ్లిప్‌‌కార్ట్ భారత్ ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. రాబోయే 30 రోజుల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ధ్రువీకరించారు. జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రంగంలో మరింత పోటీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  సరైన విధానం, పకడ్బందీ అమలుతో  ఏ సంస్థ అయినా మార్కెట్లో విజయాలు సాధించగలదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం భవిష్యత్తులో 25 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.