ఫుడ్ సేఫ్టీ అధికారులు నాగోల్ లోని సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లపై రైడ్స్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్స్‌పెయిరీ అయిపోయిన పాలు, బ్రెడ్ ప్యాకెట్స్, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్ లు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ లో బొద్దింకలు తిరుగుతున్నాయి. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారు. దసరా రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.
