హైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే.. 

హైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే.. 

హైదరాబాద్ లోని 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో FSSAI రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు క్యాంపులు నిర్వహిస్తున్నామని.. కూరగాయల వ్యాపారులలో ఆహార భద్రత, పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. వ్యాపారులకు FSSAI రిజిస్ట్రేషన్, లైసెన్సులు సులభంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు.

ఆహార పరిశుభ్రత, భద్రతా నిబంధనలు, మార్కెట్ ప్రాంగణంలో శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుషాయిగూడ, ఉప్పల్, సరూర్ నగర్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, మాదన్నపేట, మీర్ ఆలం మండి, మోండా మార్కెట్, మెట్టుగూడ, ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్, లింగంపల్లి, జేఎన్‌టీయూ మార్కెట్ల దగ్గర క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

►ALSO READ | దేశాన్ని పోషిస్తున్న అన్నదాతలకు సెల్యూట్ : సీఎం రేవంత్ రెడ్డి

ఈ క్యాంపుల ద్వారా మొత్తం 926 దరఖాస్తులు స్వీకరించామని.. డిసెంబర్ 30న అదే మార్కెట్లలో మరో విడత FSSAI రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు.గతంలో దరఖాస్తు చేయలేకపోయిన వ్యాపారులకు మరో అవకాశం కల్పిస్తున్నామని.. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు అధికారులు.