
హైదరాబాద్ నగరంలో కల్తీ ఫుడ్, నాణ్యతలేని ఫుడ్ వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. ఇష్టారీతిన హోటల్స్, రెస్టారెంట్లు,స్వీట్ షాపుల్లో కల్లీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.
సెప్టెంబర్ 13న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగదులున్నట్లు గుర్తించారు. నిర్వహణ సరిగా లేని రిఫ్రిజిరేటర్ల మధ్య బొద్దింకలు, కిచెన్ లో మూతలు లేని డస్ట్ బిన్లు, జిడ్డుగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు , వంటగదిలో మూసుకుపోయిన మురుగు కాలువలు, వంట గది ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అపరిశుభ్రంగా ఉండడాన్ని రికార్డ్ చేశారు అధికారులు. ఆహారం తయారీ వంటశాలలో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేనట్లు గుర్తించారు.
►ALSO READ | మావోయిస్టు నేత సుజాత లొంగుబాటు..రూ. 25 లక్షల చెక్కు అందజేసిన డీజీపీ
ఆహార భద్రతా ప్రమాణాలు( FSSAI) ఉల్లంఘించిన చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు..ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.