
హైదరాబాద్: మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత డీజీపీ ఎదుట లొంగిపోయారు. గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్ పేట గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయ కురాలు. పశ్చిమబెంగాల్లో 2011 జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్లో భార్య ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్చార్జిగా ఉన్నారు. 43 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న సుజాత 106 కేసుల్లో నిందితురాలని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది.
ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కి రావాలని అన్నారు. సుజాత మొదట్లో ఆర్ఎ స్ూ. జన నాట్యమండలిలో పని చేశాదని చెప్పారు. 1996లో క్రమాండర్గా విధులు నిర్వహించారని, 2001లో రాష్ట్ర కమిటీ సభ్యు రాలిగా పనిచేశారని అన్నారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క బయటికి వచ్చారని తెలిపారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అం దించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 404 మంది యూజీ క్యాడర్లు, నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజన్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొం గిపోయారని డీజీపీ వివరించారు.
►ALSO READ | బీజేపీ లీడర్లను నిద్రపోనివ్వని రాజాసింగ్.. రాష్ట్ర నేతలకు సవాళ్లు, కౌంటర్లు, విమర్శలు