జగన్ కోసం… ప్రత్యేక కాన్వాయ్

జగన్ కోసం… ప్రత్యేక కాన్వాయ్

వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ కు రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర భద్రతను పెంచిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. జగన్ కాన్వాయ్ కోసం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని  AP18P3418 నంబరుతో అధికారులు కేటాయించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.

TTD పండితులు ఇవాళ(శుక్రవారం) వైఎస్‌ జగన్‌ నివాసానికి వచ్చి ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.