సెల్ఫీ కోసం సరదాగా కాలువ దగ్గరకెళ్లి.. నీళ్లలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

సెల్ఫీ కోసం సరదాగా కాలువ దగ్గరకెళ్లి.. నీళ్లలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

నిన్న సాయంత్రం ఘటన.. ఇవాళ ఉదయం దొరికిన ఇద్దరి మృతదేహాలు

నర్సింగాపూర్ సమీపంలోని ఎస్సారెస్పీ డి-64 కాలువ దగ్గర ప్రమాదం

జగిత్యాల జిల్లా: సెల్ఫీల పిచ్చి మరో ఇద్దరు యువకుల జీవితాలను బలితీసుకుంది.  సరదాగా కాలువ దగ్గరకెళ్లి.. ఒడ్డున .. దిమ్మెలపై కూర్చుని నీటిలో.. కాళ్లు పెట్టి సరదా తీర్చుకుంటున్న వీడియోలో జీవితంలో చివరి ఘడియలయ్యాయి. ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి ప్రవాహంలో ఒడ్డుకు రాలేక.. చాలా దూరం కొట్టుకునిపోయి బయటపడలేక కన్నుమూశారు. నర్సింగాపూర్ సమీపంలోని ఎస్సారెస్పీ డి-64 కాలువలో జరిగిన ఘటన పరిసర ప్రాంతాలను విషాదంలో ముంచెత్తింది.

గురు, రవి, కిరణ్ అనే ముగ్గురు యువకులు నిన్న సాయంత్రం అ కాలువ వద్ద పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో కాళ్లు పెట్టి జలకాలాడుకుంటూ.. సెల్ఫీ దిగుతుండగా ప్రమాద వశాత్తు జారిపడినట్లు చెబుతున్నారు. జగిత్యాల రవీంద్రనాథ్ ఠాగూర్ కాలనీకి చెందిన కిరణ్, థరూరు గ్రామానికి చెందిన రవి కాలువలో పడి చనిపోయారు. వీరి మృతదేహాలను ఇవాళ ఉదయం పోలీసులు వెలికితీశారు. రవి అనే యువకుని దేహం వంజర పల్లి వద్ద లభ్యం కాగా, కిరణ్ డెడ్ బాడీ వెల్దుర్తి దగ్గర దొరికింది. అయితే రవి అనే వ్యక్తి నడుము దిగువ భాగంలో దుస్తులు లేకపోవడం, కిరణ్ ఒంటి పై పాయింట్ మాత్రమే ఉండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుల మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  పోలీసులు జరిగిన సంఘటనపై గురు అనే మరో యువకున్ని విచారిస్తున్నారు. ఒంటిపై ఉన్న నైట్ పాయింట్ కాలువలో నీటి ప్రవాహానికి జారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మద్యం తాగడానికి వచ్చి సెల్ఫీల మోజులో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు తీసుకున్న ఫొటోలు, వీడియో వెంట వెంటనే స్నేహితులకు అప్ డేట్ చేసారు. అవి కూడా లభ్యమయ్యాయి.