ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం..సూడో పోలీస్ అరెస్ట్

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం..సూడో పోలీస్ అరెస్ట్

హైదరాబాద్ లో సూడోపోలీసును అరెస్ట్ చేశారు పోలీసులు.మోసాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లా అవతారమెత్తి దర్జాగా పోలీస్ యూనిఫాం ధరించి, బైక్ పై పోలీస్ అని రాసుకొని, సైరన్ పెట్టుకొని మరీ తిరుగుతున్నాడు. అంతేకాదు..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని ప్రజలను మోసం చేసి లక్షల్లో దండుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

యూసుఫ్ గూడకు చెందిన కోనకంచి కిరణ్ కుమార్ ను ఆదివారం (మే25) పోలీసులు అరెస్ట్ చేశారు.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.పోలీస్ యూనిఫాం ధరించి బైక్ పై పోలీస్ అని రాసుకుని, సైరన్ పెట్టుకొని మరీ తిరుగుతున్నాడు. ఇంతటితో ఆగకుండా  ఉద్యోగాలిప్పిస్తానని ఐదుగురు యువకులనుంచి రూ. 20లక్షల వరకు వసూలు చేశాడు. 

ALSO READ | ప్రయాణం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ.. నేరం రుజువయ్యే వరకు ప్రాథమిక హక్కులను నిరాకరించలేం: హైకోర్టు

మోసపోయామని గ్రహించిన ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిరణ్ కుమార్ బాగోతం బయటపడింది. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అతడిని నుంచి రూ. 5.45 లక్షల నగదు, నకిలీ గుర్తింపు కార్డులను, బైకులు స్వాధీనం చేసుకున్నారు.